: గోప్యత పాటిస్తున్న అమీర్!
'సత్యమేవ జయతే 2' సీజన్ కు నటుడు అమీర్ ఖాన్ చాలా గోప్యత పాటిస్తున్నాడు. చిత్రీకరణకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటికి పొక్కకూడదని, అందులో చర్చించే అంశాలు ముందే ఎక్కడా రాకూదని పకడ్బందీ చర్యలు చేబట్టాడు. సెక్యూరిటీ కోసం ఓ టీమ్ ను పెట్టి మరీ సెట్స్ లోకి బయటివారెవరినీ రాకుండా చూడమన్నాడట. అంతేకాదు, కార్యక్రమానికి పనిచేస్తున్న సహాయ దర్శకులు, మిగతా యూనిట్ కూడా తమ సెల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేసి పెట్టాలని, ఎలాంటి వీడియోలను తీయవద్దని అమీర్ ఆదేశాలిచ్చినట్లు యూనిట్ సభ్యుడొకరు చెప్పారు. అత్యాచార ఘటనల బాధితులతో కొన్ని ఎపిసోడ్లు చేస్తున్నందున వారి వివరాలు, ఫోటోలు బయటికి రాకూడదని, అంతా రహస్యంగా ఉండాలని క్లియర్ గా చెప్పాడట. ముందే తెలిస్తే బాధితులకు ఇబ్బంది కలగవచ్చుననే అభిప్రాయంతోనే ఇలా ఈ మిస్టర్ పర్ ఫెక్షనిస్టు జాగ్రత్త వహిస్తున్నాడు.