: ప్రతిపక్షం తరహాలో పార్టీ పనిచేయాలి: బొత్స
ఎన్నికల ఏడాది కావడంతో అధికార పార్టీ, ప్రతిపక్షంలా పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలకు తాను వ్యతిరేకమని ఆయన తెలిపారు. కార్యకర్తలు సమష్టిగా శ్రమిస్తే మళ్లీ అధికారంలోకి రావటం పెద్ద కష్టం కాదని బొత్స వ్యాఖ్యానించారు.