: వెయ్యిమంది సోనియాలు వచ్చినా నన్నేమీ చేయలేరు: బాబు
తన నిజాయతీయే తనకు శ్రీరామరక్ష అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. వెయ్యిమంది సోనియాలు వచ్చినా తననేమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. అందుకు తన నీతి నిజాయతీలే కారణమని చెప్పారు. విజయనగరం సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఎవరైనా కాంగ్రెస్ పేరెత్తితే సంఘ బహిష్కరణ విధించే రోజులు వస్తాయన్నారు. 'మనం ఎన్టీఆర్ కు వారసులం' అని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు ఒక కొండవీటి సింహంలా తయారవ్వాలని బాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా ముందుకుసాగాలని సూచించారు.