: 'జాబు రావాలంటే బాబు రావాలంటున్నారు'
విజయనగరం సభలో బాబు ఉత్తేజపూరితంగా ప్రసంగిస్తున్నారు. తెలుగు యువత జాబ్ రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాల్సిందేని భావిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ ను తాను ప్రపంచపటంలో నిలబెట్టానని చెప్పుకొచ్చారు. కొత్త రాజధాని నిర్మించాలంటే టీడీపీ అధికారంలో రావాలని బాబు స్పష్టం చేశారు. గత పదేళ్ళుగా కాంగ్రెస్ దొంగలు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. సోనియా ఊరికొక అవినీతి పరుడిని తయారుచేసిందని మండిపడ్డారు.