: జైరాం రమేశ్ ఓ పనికిమాలినవాడు: బాబు
విజయనగరం సభలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పెద్దలపై నిప్పులు చెరిగారు. జైరాం రమేశ్ ను ఓ పనికిమాలినవాడని అభివర్ణించారు. తాను తెలుగుజాతికి న్యాయం చేయాలని కోరితే, జైరాం పుండు మీద కారం చల్లినట్టు వ్యవహరిస్తున్నాడని బాబు మండిపడ్డారు. సోనియా, జైరాంల భిక్ష తెలుగు ప్రజలకు అవసరం లేదని తెలిపారు.