: శివరాత్రికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన కీసర రామలింగేశ్వర ఆలయం


రంగారెడ్డి జిల్లా కీసరలోని రామలింగేశ్వర ఆలయాన్ని మహాశివరాత్రి వేడుకల సందర్భంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆధ్యాత్మిక శోభతో, విద్యుద్దీపాల వెలుగులతో ఆలయం విరాజిల్లుతోంది. కీసరలో గురువారం నుంచి మూడు రోజుల పాటు మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిపేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినానికి హైదరాబాదు సహా పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో కీసరకు తరలివస్తారు. భక్తుల దర్శనానికి మూడు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. గురువారం వేకువ జాము నుంచే రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగనున్నాయి.

  • Loading...

More Telugu News