: ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన టీమిండియా
ఆసియా కప్ మ్యాచ్ లో టీమిండియా అర్థ సెంచరీ చేసి ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత ఓపెనర్ల జోడీ పరుగులు చేసేందుకు తంటాలు పడింది. 5 ఓవర్లు ఆడిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడి కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగింది. తరువాత 5 ఓవర్లు కాస్త ఫర్వాలేదనిపించారు. నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యమిచ్చిన ధావన్, రోహిత్ లు ఏ దశలోనూ బంగ్లా బౌలర్లపై పైచేయి సాధించలేదు.
దీంతో కట్టుదిట్టమైన బంతులేసిన బంగ్లాదేశ్ బౌలర్లు రోహిత్, ధావన్ లను ముప్పుతిప్పలు పెట్టారు. అబ్దుర్ రహ్మాన్... వికెట్ల ముందు ధావన్ ను 28 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద దొరకబుచ్చుకున్నాడు. దీంతో, ధావన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తరువాత కాసేపటికే రోహిత్ శర్మ(21) కూడా జియావుర్ రెహ్మాన్ వేసిన అద్భుతమైన బంతికి బౌల్డయ్యాడు. క్రీజులో కెప్టెన్ కోహ్లీ(9)కి జతగా అజింక్యా రహానే ఆడుతున్నాడు.