: ఐపీఎల్ ఫిక్సింగ్ పై శ్రీనివాసన్ 'నో కామెంట్స్'
ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణం వెనుక బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ ఉన్నాడంటూ 'జీ మీడియా' చేసిన స్టింగ్ ఆపరేషన్ లో బాలీవుడ్ నటుడు విందు దారా సింగ్ వెల్లడించడంపై శ్రీనివాసన్ స్పందించడానికి నిరాకరించారు. అలాంటి విషయాలపై తాను స్పందించనన్నారు. మరోవైపు, ఇదే వ్యవహారంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ను సంప్రదించగా ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ అంతా బీసీసీఐ అంతర్గత వ్యవహారమని, మధ్యలో జోక్యం చేసుకోబోమని, ఎలాంటి చర్యలు తీసుకోవాలో బీసీసీఐ ఇష్టమని ముక్తాయించింది.