: ‘పాలెం’ బస్సు ప్రమాదంపై సీఐడీ విచారణ పూర్తి
మహబూబ్ నగర్ జిల్లా పాలెం సమీపంలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద ఘటనపై సీఐడీ విచారణ పూర్తయిందని అదనపు డీజీ కృష్ణ ప్రసాద్ అన్నారు. వోల్వో బస్సు డిజైనింగ్ లో పొరపాట్ల వల్లే ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. పాలెం బస్సు ప్రమాద ఘటనకు బాధ్యులైన జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమారెడ్డిని అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. ఆమెతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని కృష్ణ ప్రసాద్ తెలిపారు.