: టీ-బిల్లుకు న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్
పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014కు కేంద్ర న్యాయశాఖ ఈరోజు (బుధవారం) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమోదముద్ర పడిన అనంతరం బిల్లు నేరుగా కేంద్ర హోంశాఖకు చేరుకుంటుంది. హోంశాఖ నుంచి బిల్లు ఈ రోజు రాత్రికల్లా రాష్ట్రపతి భవన్ కు చేరుతుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ బిల్లు పూర్వాపరాలు పరిశీలించనున్నారు.