: జంతువుల బోనులో భారత క్రికెటర్


భారత్ లో వన్యప్రాణుల హక్కుల కోసం పోరాడుతున్న సెలబ్రిటీల జాబితాలో భారత క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా చేరాడు. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) సంస్థ కోసం లెఫ్టార్మ్ స్పిన్నర్ ఓజా ఏం చేశాడో చూడండి. తనను తాను ఓ బోనులో బంధించుకున్నాడు. ఆ బోనుకు ఉన్న ప్లకార్డుపై 'జంతువులను వాటి మానాన వాటిని వదిలేయండి, జంతు ప్రదర్శన శాలలకు నో చెప్పండి' అని ఉంది. స్వేచ్ఛగా తిరిగే జంతువులను జూలో బంధిస్తే అవి సంతోషంగా ఉండవని పెటా వాదిస్తోంది. అందుకే జూ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. జంతు హింస, వన్యప్రాణులకు స్వేచ్ఛ వంటి అంశాలపై పెటా ఎప్పటి నుంచో ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు మద్దతిస్తున్నారు. పెటాకు ప్రచారం చేస్తున్న క్రీడాకారుల్లో ఇంగ్లండ్ క్రికెటర్ జేడ్ డెర్న్ బాచ్, అమెరికా బాస్కెట్ బాల్ స్టార్ డెనిస్ రాడ్ మన్ ఉన్నారు.

  • Loading...

More Telugu News