: భజ్జీ రాకను ధోనీ ప్రభావితం చేస్తున్నాడు: గంగూలీ
ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు తిరిగి జట్టులోకి వచ్చే సత్తా ఉందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కానీ, టీమిండియా ఎంపిక సందర్భంగా భజ్జీని తీసుకునే విషయంలో కెప్టెన్ ధోనీ సెలక్టర్లను ప్రభావితం చేస్తున్నట్టుందని చెప్పాడు. ధోనీకి ఇష్టమైన ఆటగాళ్ళ పేర్లు సెలక్షన్ తెరపైకి వచ్చినప్పుడు సహజంగానే సెలక్టర్లు భజ్జీని పెద్దగా పట్టించుకోరని గంగూలీ వివరించాడు.