: కేంద్ర మంత్రి జైరాం రమేష్ కు చేదు అనుభవం.. సీమాంధ్రుల ఝలక్
తిరుపతి పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి జైరాం రమేష్ కు చేదు అనుభవం ఎదురైంది. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీమాంధ్రులు ఝలక్ ఇచ్చారు. జైరాం రాకను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. సమైక్యవాదుల ఆందోళనతో కేంద్ర మంత్రి జైరాం రమేష్ తిరిగి విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు. సమైక్యవాదులు అడ్డుకుంటారనే సమాచారంతో ఆయన తోకముడిచి వెనక్కి వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నారు.