: గుద్దుకున్న రాయుడు, షమి.. తొలి వికెట్ తీసిన టీమిండియా


బంగ్లాదేశ్ జట్టును టీమిండియా కట్టడి చేస్తోంది. ఓపెనర్లు స్వేచ్ఛగా ఆడకుండా కట్టుదిట్టమైన బంతులతో భారత జట్టు ప్రధాన బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. షమి వేసిన ఆరో ఓవర్లో ఓపెనర్ షంషుర్ రహమాన్ బంతిని డిఫెన్స్ ఆడబోయాడు. అది ఎడ్జ్ తీసుకుని పైకి లేవడంతో మిడాన్ లో ఉన్న రాయుడు, బౌలర్ షమి ఎదురెదురుగా బంతి కోసం పరిగెత్తుకుంటూ వచ్చి గుద్దు కున్నారు. అయినప్పటికీ క్యాచ్ నేలపాలు చేయకుండా షమి బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఇద్దరూ పరిగెత్తుకుంటూ ఎవరూ 'లీవ్ ఇట్' అని చెప్పకుండా గుద్దుకోవడంతో రాయుడు, షమితో పాటు టీమిండియా సభ్యులంతా నవ్వుకున్నారు. దీంతో బంగ్లాదేశ్ పది ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక వికెట్ నష్టానికి 36 పరుగలు చేసింది.

  • Loading...

More Telugu News