: వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: బాలకృష్ణ


వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీచేస్తానని టాలీవుడ్ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లావుకొత్తూరు గ్రామంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారిని ఆయన ఇవాళ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా బాలయ్య విలేకర్లతో మాట్లాడారు. పార్టీ ఆదేశిస్తే సామాన్య కార్యకర్తగా సైతం పార్టీ కోసం పాటుపడతానని వెల్లడించారు. 

  • Loading...

More Telugu News