: ఆ కుంభకోణాలపై రాహుల్ పెదవి విప్పరేం?: అరుణ్ జైట్లీ


బీజేపీ నేత అరుణ్ జైట్లీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధించారు. 2జీ స్ప్రెక్ట్రమ్ కుంభకోణం, బొగ్గు స్కాం, హెలి స్కాంలపై రాహుల్ పెదవి విప్పరెందుకని ప్రశ్నించారు. ఈ అవినీతి మకిలిపై పార్లమెంటులో మౌనం వహించిన రాహుల్ ఇప్పుడు హడావుడిగా అవినీతిపై ఆర్డినెన్స్ ల కోసం ఎందుకు పట్టుబడుతున్నారో చెప్పాలని నిలదీశారు. అవినీతిపై పోరాడుతున్నానని చెప్పుకుంటున్న రాహుల్ యూపీఏ హయాంలో వెలుగుచూసిన కుంభకోణాలపైనా స్పందించాలని జైట్లీ డిమాండ్ చేశారు. ఎన్డీటీవీ షోలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News