: విద్యార్థులూ.. ఎర్త్ అవర్ లో పాల్గొనండి: సీబీఎస్ఈ


ఈ రోజు రాత్రి ప్రపంచవ్యాప్తంగా జరగనున్న 'ఎర్త్ అవర్' కార్యక్రమాన్ని పరిశీలించాలని విద్యార్థులందరినీ సీబీఎస్ఈ కోరింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో పాటు ఇందులో పాల్గొనాలని సూచించింది. ఈ మేరకు తన పరిధిలో ఉన్న అని స్కూళ్లకూ సీబీఎస్ఈ ఆదేశాలు జారీ చేసింది. 

ఎర్త్ అవర్ ఈ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 వరకూ గంటపాటు జరుగుతుంది. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల విద్యుత్ లైట్లు ఆఫ్ చేస్తారు. అలానే అవసరం లేని ఇతర ఉపకరణాలను ఆపేసి విద్యుత్ ఆదా చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 'వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్' చేపడుతున్న ఈ కార్యక్రమం విషయంలో విద్యార్థులు తగిన సమాచారం తెలుసుకోవడం, పర్యావరణ ప్రాధాన్యం, ఇతర విశేషాలు తెలుసుకోవడం కోసమే సీబీఎస్ఈ ఈ చర్య తీసుకుంది. 

  • Loading...

More Telugu News