: 21 మంది రోగులపై మత్తు వైద్యుడి పాడు పనులు.. 10 ఏళ్ల జైలు


ప్రాణం పోసే వైద్యులను దేవుడితో సమానంగా భావిస్తాం. కానీ, ఒక కెనడా వైద్యుడు పవిత్రమైన వృత్తిలో పాడు పనులకు పాల్పడ్డాడు. శస్త్రచికిత్సల సమయంలో మత్తు ముందు ఇచ్చి.. ఆ తర్వాత రోగులపై పాడు పనులు చేసేవాడు. ముద్దు పెట్టుకోవడం, ఇంకేవో పనులు చేసేవాడు. ఇలా 21 మందిపై అతడు కామకలాపాలు సాగించాడు. మత్తు మందు ఇవ్వడంతో స్పృహలోనే ఉన్నా.. వైద్యుడు చేస్తున్న పనులు తెలుస్తున్నా.. వారు ప్రతిఘటించలేని పరిస్థితి. ఇతడి చేతిలో వేధింపులకు గురైన మహిళలు 25 నుంచి 75 ఏళ్ల వయసులోపు వారున్నారు. 2006 నుంచి 2010 మధ్య ఇతడీ నేరాలకు పాల్పడ్డాడు. మత్తు వైద్యుడు జార్జ్ డూడ్ నాట్(65) నేరాభియోగాలు నిరూపణ కావడంతో కోర్టు అతనికి 10ఏళ్ల జైలు శిక్ష విధించింది.

  • Loading...

More Telugu News