: కోహ్లీ నుంచి మెరుగైన ఫలితాలు ఆశించొద్దు: గవాస్కర్


ధోనీ స్థానంలో టీమిండియా పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ నుంచి ఆసియా కప్ లో మెరుగైన ఫలితాలు ఆశించరాదని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అంటున్నాడు. ఈ ఒక్క టోర్నీ ద్వారా కోహ్లీ నాయకత్వ లక్షణాలపై ఓ అంచనాకు రావొద్దని పేర్కొన్నాడు. భారత జట్టు ఇటీవల నమోదు చేసిన పరాజయాల నేపథ్యంలో ఈ యువ కెప్టెన్ ఆసియా కప్ లో ఒత్తిడికి లోనయ్యే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ గనుక టోర్నీలో జట్టును విజయాల బాట పట్టిస్తే అతని కెప్టెన్సీ ప్రస్థానానికి శుభారంభం అవుతుందని సన్నీ చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీలో ధోనీ సేవలను టీమిండియా కోల్పోయిందని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News