: 200కి పైగా సినిమాలు ఆగిపోయాయి: నిర్మాత అంబికా కృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో తెలుగు చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రముఖ చిత్ర నిర్మాత అంబికా కృష్ణ తెలిపారు. ఈరోజు (బుధవారం) ఉదయం ఆయన తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అంబికా కృష్ణ మీడియాతో మాట్లాడారు. చిన్న సినిమాలు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, విభజన వల్ల ఆ ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయని ఆయన అన్నారు. సుమారు 220 సినిమాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన వల్ల చిన్న సినిమాల నిర్మాతలకు తీవ్ర నష్టం కలిగిందని ఆయన చెప్పారు.