: చిన్నారికి ప్రాణం పోసిన 'త్రీడీ' గుండె
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. సాంకేతిక నైపుణ్యం సౌకర్యాలు కల్పించే స్థాయి నుంచి ప్రాణాలు నిలిపే స్థాయికి చేరుకుంది. 'త్రీడీ' ప్రింటర్ పై రూపొందించిన ఒక కృత్రిమ గుండె చిన్నారికి ప్రాణం పోసింది. అమెరికాలోని కెంటకీకి చెందిన రోలాండ్ లియాన్ అనే శిశువు గుండెలో నాలుగు తీవ్ర లోపాలతో జన్మించాడు. దీంతో అతడి గుండెలో లోపాల్ని గుర్తించిన లూస్ విల్లే వర్సిటీ, కోసేర్ ఆసుపత్రి వైద్యులు సాంకేతక సౌకర్యాన్ని వినియోగించుకున్నారు.
తొలుత వైద్యులు ఆ చిన్నారి గుండెను అన్ని కోణాలలో సిటీ స్కాన్ ద్వారా చిత్రీకరించారు. వాటి సాయంతో ఆ చిన్నారి గుండెను 'త్రీడీ' ప్రింటర్ పై 50 శాతం పెద్దదిగా ప్రింట్ చేశారు. దాని సహాయంతో శస్త్ర చికిత్సకు నిర్దిష్టమైన ప్రణాళిక రచించి, ఒక చిన్న శస్త్రచికిత్సతో అన్ని లోపాలను సరి చేశారు. చిన్న గాటుతోనే శస్త్ర చికిత్స చేయడంతో కేవలం నాలుగు రోజుల్లోనే చిన్నారి కోలుకుంది.