: నేడు విజయరథంపై ఊరేగనున్న కేసీఆర్
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఢిల్లీ వెళ్లున్నా... తెలంగాణ రాష్ట్రం తరపునే తిరిగొస్తా" అని చెప్పి వెళ్లిన కేసీఆర్... అన్నట్టుగానే తెలంగాణ సాధించి ఈ రోజు హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. దీంతో ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శంషాబాద్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి హెలికాప్టర్ లో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. ఇక్కడ ఆయనకు వేయి మంది బ్రాహ్మణులు పూర్ణకుంభ స్వాగతం పలుకుతారు. అనంతరం విజయరథంపై ఊరేగింపుగా గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు బయలుదేరుతారు. అక్కడ 1969లో మరణించిన అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. బేగంపేట నుంచి గన్ పార్కుకు చేరుకునే సమయంలో హెలికాప్టర్ తో పూల వర్షం కురిపిస్తారు.