: పాకిస్థాన్ లో శివరాత్రి మహోత్సవాలు... తరలి వెళ్లిన 187 మంది భారతీయులు


ముస్లిం దేశమైన పాకిస్థాన్ లో శివరాత్రి మహోత్సవాలేమిటీ? అనే సందేహం వచ్చే ఉంటుంది. కానీ, ఇది నిజం. పంజాబ్ ప్రావిన్స్ లోని చక్వాల్ జిల్లా కాటస్ గ్రామంలో 6వ శతాబ్దానికి చెందిన కాటస్ రాజ్ మందిరం ఉంది. లాహోర్ కు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. పాండవులు తమ అజ్ఞాత వాసంలో కొంత కాలం ఇక్కడ గడిపినట్లు భావిస్తారు. గురువారం ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు 187 మంది భారత హిందూ యాత్రికులు తరలి వెళ్లారు. వీరికి గురువారం పాక్ సరిహద్దు వాఘా చెక్ పోస్ట్ వద్ద ఈటీపీబీ అధికారులు స్వాగతం పలికారు. పాక్ లో మైనారిటీ మతస్థుల మందిరాలను ఈటీపీబీ సంరక్షిస్తుంటుంది. భారత యాత్రికులకు తగినంత భద్రత కల్పించామని ఈటీపీబీ డిప్యూటీ డైరెక్టర్ అబ్బాస్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఉచిత భోజన, రవాణా, బస కల్పిస్తామన్నారు. వారం రోజుల ఉచిత యాత్రలో భాగంగా లాహోర్ లోని కృష్ణ మందిర్, గురుద్వారా దేరాసాహిబ్ మందిరాలను కూడా భారత యాత్రికులు దర్శిస్తారు.

  • Loading...

More Telugu News