: శ్రీశైలంలో అత్యంత వైభవంగా సాగుతోన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ఆరవ రోజైన ఇవాళ (మంగళవారం) సాయంత్రం పల్లకీ సేవ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. పుష్పాలంకార శోభితురాలైన భ్రమరాంబికా దేవి, మల్లికార్జునస్వామితో కలసి పల్లకీలో ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తోంది. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.