: సముద్ర తీరంలో ‘శాండ్ థెరపీ’... ఆరోగ్యం కోసమే సుమా!
సముద్రతీరంలో సూర్యరశ్మి కోసం విదేశీయులు అనుసరించే ‘బీచ్ శాండ్ థెరపీ’కి పాశ్చాత్య దేశాల్లో అత్యంత ఆదరణ ఉంది. ఈ ఇసుక చికిత్స (శాండ్ థెరపీ)ని నాడీపతి అంటారు. ఇప్పుడీ చికిత్స మన రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో కూడా క్రమేపీ ప్రజాదరణ పొందుతోంది. తల మాత్రమే బయటకి కనిపించేలా శరీరమంతా ఇసుక కప్పుకుని సూర్యకాంతి కోసం సముద్ర తీరంలో పడుకుంటారు. ఇదో రకం చికిత్స విధానమని, దీంతో వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని నాడీపతి చికిత్సను అందించే వైద్యులు కృష్ణంరాజు తెలిపారు. ఇసుకలో ఉండే అనేక రకాల ఖనిజలవణాల వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, సాధారణ వ్యాధులతో పాటు దీర్ఘకాల వ్యాధుల బారి నుంచి ఇసుక చికిత్సతో ఉపశమనం లభిస్తుందని ఆయన చెప్పారు.