: మహారాష్ట్ర గవర్నర్ కార్యాలయానికి అంతర్జాతీయ గుర్తింపు


మహారాష్ట్ర రాజ్ భవన్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ అత్యున్నత పాలన విధానాలను రూపొందించినందుకు, ప్రమాణాలు పాటించినందుకుగాను ఐఎస్ఓ సర్టిఫికెట్ దక్కించుకుంది. భారత్ లో ఐఎస్ఓ సర్టిఫికెట్ ను పొందిన తొలి రాజ్ భవన్ గా రికార్డుల్లోకి ఎక్కింది. ముంబయిలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రాజ్ భవన్ ప్రశాంతమైన వాతావరణంలో నెలకొని వుంది.

ఐఎస్ఓ 9001-2008 పత్రాన్ని గవర్నర్ శంకర నారాయణన్ ఈరోజు (మంగళవారం) స్వీకరించారు. ఈ సందర్భంగా ఉన్నత ప్రమాణాలను పాటించి, ఉత్తమ సేవల్ని అందించిన రాజ్ భవన్ అధికారులను, సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ఇక ముందు కూడా రాజ్ భవన్ పనితీరు ప్రభుత్వ కార్యాలయాలకు మార్గదర్శకంగా నిలవాలని గవర్నర్ ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News