: వీహెచ్ పీకి ఏ పార్టీతోనూ సంబంధం లేదు: తొగాడియా
ఏ రాజకీయ పార్టీకి, వ్యక్తులకు తాము మద్దతు ఇవ్వడం లేదని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వీహెచ్ పీకి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. వీహెచ్ పీకి ఎలాంటి రాజకీయ అజెండా లేదని అన్నారు. నీతిమంతునికి, ప్రజాసేవ చేసే నాయకునికి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. కోట్లాది హిందువుల పరిరక్షణ కోసమే విశ్వహిందూ పరిషత్ కట్టుబడి ఉందని ఆయన ఉద్ఘాటించారు.