: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తాం: ఈసీ వర్గాలు
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. మే మూడో వారానికంతా ఎన్నికల ప్రక్రియను ముగించాలని ఈసీ వర్గాలు భావిస్తున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను విడివిడిగా జరపాలన్న ఆలోచన ఈసీ వర్గాల్లో లేదని సమాచారం. ఈ మేరకు వచ్చే వారానికంతా ఎన్నికల షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉంది.