: కేసీఆర్ కుటుంబం సోనియాను ఎందుకు కలిసింది?: ఎర్రబెల్లి


తెలంగాణ వస్తే తన కుటుంబం రాజకీయాల్లో ఉండదని గతంలో అన్న కేసీఆర్, విభజన బిల్లు ఆమోదం పొందిన వెంటనే కుటుంబంతో సహా వెళ్లి సోనియాను ఎందుకు కలిశారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి కోసం కేసీఆర్ సోనియా కాళ్లు పట్టుకున్న మాట వాస్తవం కాదా? అని అడిగారు. వరంగల్ లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎర్రబెల్లి మాట్లాడుతూ... జేఏసీ తరపున శ్రీకాంతాచారి కుటుంబానికి టికెట్ ఇస్తే పాలకుర్తి నుంచి తాను పోటీ చేయనన్నారు. సీమాంద్ర నేతలు ఎంత ఒత్తిడి చేసినా చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News