: టీఆర్ఎస్ అర్ధం మారింది: కేటీఆర్


ఇప్పటి వరకు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని ఇకపై టీఆర్ఎస్ అంటే 'తిరుగులేని రాజకీయ శక్తి' అని టీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, చెప్పిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ రేపు హైదరాబాదులో అడుగుపెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం అవుతుందని ఎక్కడా చెప్పలేదని అన్నారు. పార్టీలో అందరితో చర్చించిన తరువాతే విలీనం, పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక టీఆర్ఎస్ కు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News