: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో పునర్విచారణకు ఆదేశం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కామ్ పై మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ ఆర్ పాటిల్ పునర్విచారణకు ఆదేశించారు. ఈ స్కాంలో గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటుడు విందు దారా సింగ్ ప్రముఖ వార్తా చానల్ 'జీ మీడియా' రిపోర్టర్ తో మాట్లాడుతూ, ఫిక్సింగ్ వెనుక అసలు సూత్రదారులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ, ఇతరులు ఉన్నట్లు కొన్ని పేర్లు బయటపెట్టాడు. అయితే, ఈ వ్యవహారంలో తాను చిన్న వ్యక్తినేనని చెప్పాడు. వెంటనే వాటిని పరిశీలించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అయితే, ఈ విచారణలో దారా సింగ్ ను కూడా ప్రశ్నిస్తారని తెలిపారు.