: సీమాంధ్రను సింగపూర్ స్థాయిలో అభివృద్ధి చేస్తా: చంద్రబాబు
సీమాంధ్రను సింగపూర్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రలో ఉండేది టీడీపీ మాత్రమేనని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేత కరి రాజారావు, విశాఖకు చెందిన విశ్రాంత ఉద్యోగులు టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారు.