: ఏసీబీకి హైకోర్టు మొట్టికాయలు
ప్రజాప్రతినిధులపై ఏసీబీ ప్రత్యక్షంగా చర్యలు తీసుకోవద్దన్న మెమోపై ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం చెప్పినట్టు కాకుండా న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏసీబీ నడచుకోవాలని హైకోర్టు ఏసీబీకి మొట్టికాయలు వేసింది. ప్రాథమిక ఆధారాలుంటే కేసు నమోదు చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై న్యాయస్థానం రేపు నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.