: ‘సహారా’ అధినేత సుబ్రతారాయ్ పిటిషన్ ను తోసిపుచ్చిన ‘సుప్రీం’
సహారా ఇండియా గ్రూపు సంస్థల అధినేత సుబ్రతారాయ్ వేసిన పిటిషన్ ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణ సమయంలో కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సుబ్రతారాయ్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. రాయ్ డబ్బు చెల్లిస్తారని, ఆయనకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాది రాంజెఠ్మలానీ న్యాయస్థానానికి విన్నవించారు. అయితే, ఇప్పటివరకు రాయ్ కోర్టు ఆదేశాలను పాటించలేదని, అందుకే ఆయనకు మినహాయింపు ఇచ్చేది లేదని ‘సుప్రీం’ స్పష్టం చేసింది.