: బుల్లెట్లు దూసుకొచ్చినా... ఆ వ్యక్తి బతికిపోయాడు!
తుపాకీ బుల్లెట్లు దూసుకొచ్చినా, ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. పాయింట్ బ్లాంక్ రేంజిలో శరీరంలోకి బుల్లెట్ దూసుకెళితే ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అలాంటిది, రెండుసార్లు కాల్పులు జరిపినా ఆ వ్యక్తి బతికిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఒహియోలో బస్సు డ్రైవర్ రికీపై ఆగంతుకులు పాయింట్ బ్లాంక్ రేంజ్ తో కాల్పులు జరిపారు.
అయితే బుల్లెట్లు శరీరాన్ని తాకలేదు. తన పాకెట్ లో దాచుకున్న పుస్తకమే తనను కాపాడిందని రికీ అంటున్నాడు. ‘ది మెస్సేజ్’ పేరుతో ఉన్న బైబిల్ వాక్యాలతో కూడిన గ్రంథం బుల్లెట్లకు అడ్డు తగిలిందని రికీ పోలీసులకు తెలిపాడు. దీంతో, ఈ ఘటనపై అమెరికాలోని మీడియా పలు కథనాలను ప్రసారం చేసింది. ఈ వార్తాకథనాలను చూసిన ‘ది మెస్సేజ్’ రచయిత పీటర్సన్ సంతోషం వ్యక్తం చేశారు. తను రాసిన పుస్తకం ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడితే అంతకన్నా ఆనందమేముందని పీటర్సన్ మీడియాకు చెప్పాడు.