: రాజకీయ పార్టీల ఆఫీసుల్లో జరిగే పెళ్లిళ్లు చెల్లవు: కేరళ హైకోర్టు
రాజకీయ పార్టీ ఆఫీసుల్లో జరిగే పెళ్లిళ్లను అంగీకరించమని... వాటిని చట్టవిరుద్ధమైనవిగా పరిగణిస్తామని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. కేరళ కుట్టానాడ్ ప్రాంతంలోని నెడిముడిలో ఉన్న స్థానిక సీపీఎం పార్టీ కార్యాలయంలో ఓ యువతి పెళ్లి చేసుకుంది. దీనిపై ఆ యువతి తండ్రి కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన హైకోర్టు పార్టీ కార్యాలయాల్లో జరిగే పెళ్లిళ్లకు చట్టబద్ధత లేదని వెల్లడించింది.