: పాక్ తో పోరు ప్రత్యేకమేమీ కాదు: కోహ్లీ


చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ అన్ని మ్యాచ్ ల వంటిదేనంటున్నాడు టీమిండియా తాత్కాలిక సారథి విరాట్ కోహ్లీ. బంగ్లాదేశ్ వేదికగా జరిగే ఆసియా కప్ లో ఈ రెండు జట్లు మార్చి 2న తలపడుతున్నాయి. పాక్ తో మ్యాచ్ అంటే అందరిలోనూ ఉత్కంఠ నెలకొంటుందని, అయితే, అన్ని మ్యాచ్ లలాగానే ఆ పోరులోనూ గెలవాలని భావిస్తామని కోహ్లీ తెలిపాడు. ప్రస్తుత టోర్నీలో ప్రతి మ్యాచ్ లోనూ విజయం సాధించాలనుకుంటున్నామని వివరించాడు. పాక్ తో పోరుపై మీడియా అడిగిన ప్రశ్నకు కోహ్లీ పైవిధంగా జవాబిచ్చాడు. 'మేమిక్కడికు వచ్చింది ఒక్క మ్యాచ్ ఆడి వెళ్ళిపోయేందుకు కాదు. టోర్నమెంట్ గెలిచేందుకే బంగ్లాదేశ్ వచ్చాం' అని స్పష్టం చేశాడు. ఇక, పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్ మాట్లాడుతూ, భారత్ తో పోరు రసవత్తరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News