: పల్నాడు జిల్లాను స్వయంప్రతిపత్తితో ఏర్పాటు చేయండి: కాసు
నరసారావుపేట కేంద్రంగా మూడు రెవెన్యూ డివిజన్లతో పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని దిగ్విజయ్ సింగ్ కు సూచించానని కాసు కృష్ణారెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కోరానని అన్నారు. దిగ్విజయ్ సింగ్ కు మూడు అంశాలపై తాను సూచనలు చేశానని అన్నారు.