: ఒబామా చేతులెత్తేశారు: బాబీ జిందాల్
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై భారత సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ మండిపడ్డారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడంలో ఒబామా విఫలమయ్యారని అన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకుండా, పరిమితమైన కార్యనిర్వాహక చర్యలపై శ్రద్ధ పెడుతున్నారని జిందాల్ విమర్శించారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను కనీస వేతన వ్యవస్థగా ఒప్పుకోవడం అంటే ఓటమిని ఒప్పుకుని తెల్ల జెండాను ఎగురవేయడమేనని జిందాల్ దుయ్యబట్టారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతి సాధించేందుకు అవకాశముందని, అందుకు ఉభయపక్షాల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి వైట్ హౌస్ తన శక్తిని ఉపయోగిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.