: కాంగ్రెస్ లో మోడీ ఫ్యాన్స్


గుజరాత్ లో సీఎం నరేంద్ర మోడీ ఛరిష్మా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కూడా సమ్మోహితులను చేస్తున్నారు. గత పక్షం రోజుల్లో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, కాంగ్రెస్ హైకమాండ్ లో అలజడి మొదలైంది. వెంటనే, గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మోడీ అభిమానుల జాబితా తయారు చేయాలంటూ ఇంటలిజెన్స్ విభాగానికి సూచించింది. పార్టీలో మోడీ ఫ్యాన్స్ ను గుర్తించి వారినెలాగో దారికి తెచ్చుకోవాలని హైకమాండ్ భావిస్తోంది. ప్రస్తుతం మరికొందరు కాంగ్రెస్ నేతలకు మోడీ వర్గం గాలం వేసే పనిలో నిమగ్నమై ఉందన్న వార్తలు అధిష్ఠానానికి కంటిమీద కునుకును దూరం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News