: మీడియాను మట్టుబెట్టాలన్న వ్యాఖ్యలపై షిండే యూ టర్న్


మహారాష్ట్రలోని షోలాపూర్ లో ర్యాలీ సందర్భంగా కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే ఎలక్ట్రానిక్ మీడియాను మట్టుబెట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన తన వ్యాఖ్యలపై యూ టర్న్ తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పై వ్యతిరేక ప్రచారానికి ఎలక్ట్రానిక్ మీడియా శ్రీకారం చుడుతోందని షిండే తెలిపారు.

షోలాపూర్ లో జరిగిన మత ఘర్షణలకు ఎలక్ట్రానిక్ మీడియానే కారణం అని తాను అనలేదని, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే ఉద్రిక్తతలకు దారి తీసిందని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో స్థిరపడిన ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన నేపథ్యంలో, తాను ఈ వ్యాఖ్యలు చేశానని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News