: లైంగిక వేధింపుల ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి


విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించాడు. బిడ్డలాంటి బాలికను లైంగిక వేధింపులకు గురి చేశాడు. పాపం పండి, గ్రామస్థుల చేత బడితెపూజ చేయించుకున్నాడు. విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బ్రహ్మాజీ ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు బ్రహ్మాజీకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి బ్రహ్మాజీని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News