: తాగేందుకు అర్హత వయసును పెంచడం వల్ల ప్రయోజనమే
మన దేశంలో 18 ఏళ్లు నిండినవారికే మద్యం తాగేందుకు అర్హత ఉంది. కానీ, అమెరికాలో ఇది 21 ఏళ్లుగా ఉంది. తాగే అర్హత వయసును అక్కడ 1988లో పెంచారు. అలా పెంచడం వల్ల చాలా మంది ప్రాణాలు నిలుస్తున్నాయని తాజాగా ఓ సర్వే తేల్చింది. వయసును పెంచడం వల్ల తాగిన మత్తులో వాహన ప్రమాదాలు జరగడం తగ్గినట్లు గుర్తించామని ఈ అధ్యయనంలో పాల్గొన్న బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకుడు విలియం డీజాంగ్ తెలిపారు. మొత్తంమీద ఏటా 900 మంది ప్రాణాలైనా నిలుస్తున్నాయట. చట్టాలు అమలయ్యే చోట అలాంటి సానుకూల ఫలితాలే వస్తాయి మరి!