: యాకుబ్ ఆ సమయంలో మెతుకు ముట్టలేదు!
యాకుబ్ మొమన్... 1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు ఇతడికి మరణశిక్షను రెండు రోజుల క్రితం ఖరారు చేసింది. సుప్రీం తీర్పుతో యాకుబ్ గంభీరంగా మారిపోయాడు. కానీ దీనికంటే అతడి మనసును బాగా కష్టపెట్టిన ఘటన మరొకటి ఉంది. అదే పార్లమెంట్ పై దాడి కేసు నిందితుడు అఫ్ఝల్ గురును ఉరితీయడం!
నాగ్ పూర్ సెంట్రల్ జైలులో వున్న యాకుబ్... అఫ్జల్ ను ఉరితీసిన తర్వాత మూడు రోజుల పాటు మెతుకు కూడా ముట్టలేదట. కఠిన ఉపవాసం ఉన్నాడని యాకుబ్ ను దగ్గరగా పరిశీలించిన జైలు సిబ్బంది వెల్లడించారు.
నాగ్ పూర్ సెంట్రల్ జైలులో వున్న యాకుబ్... అఫ్జల్ ను ఉరితీసిన తర్వాత మూడు రోజుల పాటు మెతుకు కూడా ముట్టలేదట. కఠిన ఉపవాసం ఉన్నాడని యాకుబ్ ను దగ్గరగా పరిశీలించిన జైలు సిబ్బంది వెల్లడించారు.
యాకుబ్ ఎంతో తెలివైనవాడట. జైలులో ఎన్నో మేగజైన్లు, పుస్తకాలు చదవడం అతడి దినచర్యలో భాగం. జైలు అధికారులతో పలు విషయాలపై లోతుగా చర్చించడానికి కూడా యాకుబ్ ఆసక్తి చూపుతాడట. తనకు ఉరిశిక్ష పడినా చలించని యాకుబ్, అఫ్జల్ ఉరితో అంతగా చలించిపోవడం మాత్రం అంతుబట్టనిదే!