: దిగ్విజయ్ తో ముగిసిన చిరు భేటీ


రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో కేంద్ర మంత్రి చిరంజీవి భేటీ ముగిసింది. రాష్ట్ర పరిణామాలపై దాదాపు రెండు గంటల పాటు వారి మధ్య చర్చలు జరిగాయి. విభజన క్రమంలో పార్టీకి పునరుత్తేజం కల్పించేందుకు ఏ బాధ్యతలు స్వీకరించేందుకైనా తాను సిద్ధమని ఈ సమావేశంలో దిగ్విజయ్ తో చిరు చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో పార్టీ భవిష్యత్ ప్రచారం, భవిష్యత్ వ్యూహాలను చిరుకు డిగ్గీ వివరించినట్లు తెలుస్తోంది. కొత్త ముఖ్యమంత్రి నియామకం నేపథ్యంలో రెండు నెలల సమయానికి తమకు వీర విధేయుడిగా ఉండే వ్యక్తిని సీఎంగా ఉంచి ముందుకు పోవాలని కేంద్రం ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. అందుకు చిరంజీవి అయితే బాగుంటుందని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చిరుతో చర్చలు జరిపినట్లు భావించవచ్చు.

  • Loading...

More Telugu News