: తెలంగాణవాదం వల్లే టీఆర్ఎస్ కు సీట్లొచ్చాయి.. కేసీఆర్ వల్ల కాదు: డీకే అరుణ
దిగ్విజయ్ సింగ్ తో తెలంగాణ ప్రాంత తాజా మాజీ మంత్రుల భేటీ ముగిసింది. అనంతరం వారి తరఫున డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ఘనత సోనియాదే అన్న విషయాన్ని గడపగడపకూ వెళ్లి చెబుతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను విలీనం చేస్తామన్న కేసీఆర్ వెంటనే ఆ పని చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో తెలంగాణవాదం వల్లే టీఆర్ఎస్ కు ఓట్లు పడ్డాయని... అంతేకాని, కేసీఆర్ ను చూసి మాత్రం కాదని స్పష్టం చేశారు.