: సంజయ్ దత్ వరుస పెరోళ్లపై కేంద్రం ఆరా


ముంబయి వరుస పేలుళ్ల కేసులో శిక్షపడ్డ నటుడు సంజయ్ దత్ కు వరుస పెరోల్స్ అనుమతిస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గతేడాది చివరి నుంచి ఇప్పటికి మూడుసార్లు పదేపదే పెరోల్ గడువు పెంచడంపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. జైలుకెళ్లిన ఏడాదిలోపే మూడుసార్లు పెరోల్ పొందడానికి సంజయ్ కు ఉన్న ప్రత్యేక హోదా ఏమిటో తెలపాలని లేఖలో ప్రశ్నించింది. 1993 ముంబయి పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు సంజయ్ కు ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.

అయితే, గతంలో ఇదే కేసులో 18 నెలల పాటు శిక్ష అనుభవించగా మిగతా శిక్షా కాలాన్ని అనుభవించాల్సి ఉంది. దాంతో, గతేడాది మేలో దత్ ముంబయి పోలీసులకు లొంగిపోయారు. ఆ తర్వాత కొన్ని నెలలకు భార్య మాన్యతకు తీవ్ర అనారోగ్యం కారణంగా డిసెంబర్ 21 నుంచి సంజయ్ పెరోల్ పై బయటికి వచ్చారు. ఈ క్రమంలో మూడుసార్లు అతని పెరోల్ కు పూణెలోని ఎరవాడ జైలు అధికారులు అంగీకరిస్తూ వచ్చారు. ప్రస్తుతం మార్చి 21 వరకు పెరోల్ గడువును పెంచారు. ఇప్పుడిదే వివాదాస్పదంగా మారింది.

  • Loading...

More Telugu News