: కేవీపీని అరెస్ట్ చేయాలంటూ టీ లాయర్ల ఆందోళన
సీబీఐ సమన్లు అందుకున్న కేవీపీ రామచంద్రరావు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ కుషా గెస్ట్ హౌస్ వద్ద తెలంగాణ న్యాయవాదులు కేవీపీని అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది. పోలీసులు న్యాయవాదులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
దిల్ కుషా గెస్ట్ హౌస్ కు భారీ గా చేరుకున్న న్యాయవాదులు, కేవీపీ రాకతో ఒక్కసారిగా అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.