: కిరణ్ కాంగ్రెస్ లోకి వస్తానంటే కాదనం: దిగ్విజయ్
కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. కిరణ్ స్వచ్ఛందంగా రాజీనామా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కిరణ్ మనసు మార్చుకుని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. అలాగే, బహిష్కృత ఎంపీలు కూడా తిరిగి పార్టీలోకి వస్తానంటే సానుభూతితో పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి సభలో తగినంత బలముందని ఆయన తెలిపారు. సీమాంధ్ర ఎంపీల రాజీనామా వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు.