: విదేశాల్లోకి అడుగుపెడుతోన్న నారాయణ హృదయాలయ


నారాయణ హృదయాలయ... ఇప్పుడు విదేశాల్లోకి అడుగుపెడుతోంది. కరేబియన్ దీవుల్లో ఉన్న గ్రాండ్ కేమన్ ఐలాండ్ లో నూతన ఆసుపత్రిని ఏర్పాటు చేస్తోంది. హెల్త్ సిటీ కేమన్ ఐలండ్స్ పేరుతో ఆసుపత్రిని నెలకొల్పనున్నట్లు నారాయణ హృదయాలయ ఛైర్మన్ దేవిశెట్టి ప్రకటించారు. అమెరికాకు చెందిన అసెన్షియల్ హెల్త్ అలయెన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆంటోనీ ఆర్ టెర్సింగిలతో కలసి ఆయన ఆసుపత్రి తొలిదశను పూర్తి చేస్తున్నారు. వచ్చే 15 ఏళ్లలో సుమారు 372 కోట్ల రూపాయలతో వివిధ దశల్లో ఆసుపత్రిని పూర్తి చేస్తారు. 200 ఎకరాల విస్తీర్ణంతో ఏర్పాటవుతున్న ఆసుపత్రిలో 104 పడకలను ఏర్పాటు చేయనున్నారు.

కొత్తగా ఏర్పాటవుతున్న ఈ హృదయాలయలో బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్, ఏంజియోప్లాస్టీ, వాల్వ్ రీప్లేస్ మెంట్, పీడియాట్రిక్స్ తదితర విభాగాల్లో వైద్య సేవలను అందించనున్నారు. కేమన్ దీవిలో నాలుగు కోట్ల మంది జనాభా నివసిస్తోంది. ఈ ఆసుపత్రిలో భారత్, అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన 140 మంది వైద్య సిబ్బంది ఉంటారు. హృదయాలయ గ్రూపునకు మన దేశంలో హైదరాబాద్ సహా 14 నగరాల్లో 23 ఆసుపత్రులున్నాయి. ఇక బెంగళూరులో ఉన్న హెల్త్ సిటీలో అయితే అతిపెద్ద మూలుగ మార్పిడి యూనిట్, డయాలసిస్ యూనిట్ లున్నాయి.

  • Loading...

More Telugu News